calender_icon.png 22 November, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోమశిల ఐకాన్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఈటల

22-11-2025 01:28:35 AM

కొల్లాపూర్ రూరల్, నవంబర్ 21: శ్రీశైలం బ్యాక్ వాటర్ సోమశిల  లాం లో తిరుగుతూ ఐకాన్ బ్రిడ్జి పనులను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం పరిశీలించారు, 2014 తర్వాత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్ని వేల కిలోమీటర్లు హైవేస్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ నరేంద్ర మోడీ నాయకత్వంలో నేషనల్ హైవేస్ కానీ బ్రిడ్జెస్ కానీ నిర్మాణం జరిగిందని తెలిపారు, గతంలో మారుమూల ప్రాంతాల రోడ్లకు గుంతలుగా ఉండి ప్రజలు ఎంతో ఇబ్బందు లకు గురయ్యే వారని అన్నారు.

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ  వచ్చిన తర్వాత డబల్ రోడ్డు వేసి గుంతలు లేకుండా చేసిండు అన్నారు, నాగర్ కర్నూల్ నుంచి నంద్యాల వరకు రోడ్డు నిర్మాణం కోసం 2000 కోట్లు ఖర్చు చేశామని అటు ఆంధ్రప్రదేశ్ లో గాని ఇటు తెలంగాణలో గాని నేషనల్ హైవే పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు, త్వరలోనే పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు.  అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు , బిజెపి నాయకులు  సుధాకర్ రావు, చిన్నంబాయి మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, కొల్లాపూర్ మండల అధ్యక్షులు నారాయణ తదితరులు పాల్గొన్నారు,