calender_icon.png 22 November, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతిపై హరీశ్ ఆరోపణలు నిరాధారం

22-11-2025 01:31:35 AM

  1. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
  2. ధరణి పేరుతో దగా చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే 

హైదరాబాద్, నవంబర్ 21 (విజయ క్రాంతి): భూభారతి చట్టం అమలు విషయం లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన నిరాధార ఆరోపణలను రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఖండిం చారు. బీఆర్‌ఎస్‌లో జరిగిన తప్పిదాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రుద్దడం తగ దని ఆయన హెచ్చరించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి  చేసిన దాష్టీకాల వల్ల భూసమస్యలతో రైతులు సతమతమ య్యా రని, సమస్యల పరిష్కారానికి మార్గం లేక కోర్టుల చుట్టూ, కలెక్టర్ కార్యాలయాల చు ట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని కోదం డరెడ్డి గుర్తుచేశారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైయ్యాక.. వెంటనే ధరణిపై కమిటీ ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకున్నారని తెలిపారు. ధరణి స్థానంలో భూభారతి చట్టం తెచ్చి, యుద్ధ ప్రాతిపదికన ఆ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. కంప్యూటర్ల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతాంగం.. వద్దకే రెవెన్యూ అధికారులను పంపి దరఖాస్తులను తీసుకున్నారు.

సాదాబైనామా సమస్యలకు అప్పటి ప్రభుత్వం పరిష్కారాన్ని గాలికి వదిలేస్తే.. ఈ ప్రభుత్వం భూభారతిలో ఈ విషయాన్ని చేర్చడమే కాక, హైకోర్టు స్టే ఎత్తివేసేలా కృషి చేసిందన్నారు. సాదాబై నామా క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారం భించిందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 9 లక్షల దరఖాస్తులు, గత ప్రభుత్వం లో వచ్చాయన్నారు.