24-12-2025 01:43:02 AM
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం, డిసెంబరు 23 (విజయ క్రాంతి): ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలోని ’అస్త్ర’ హాలులో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అవేర్నెస్, ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన సిపి నేరగాళ్లు అవలంబిస్తున్న కొత్త కొత్త పద్ధతుల పట్ల పోలీసు అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే బాధితులకు త్వరితగతిన న్యాయం చేయగలమని సూచించారు. నగదు రహిత లావాదేవీల వల్ల కలిగే ప్రయోజనాలు, సైబర్ భద్రతా చిట్కాలను పోలీసు సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆర్బీఐ అధికారులు, ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ మేనేజర్ సత్యజిత్ ఘోష్, మేనేజర్ ఖాదర్ హుస్సేన్, వెంకటరమణ, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.