calender_icon.png 24 December, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘టెండర్ల’కు వెనుకంజ..!

24-12-2025 01:41:51 AM

టెండర్ల ప్రక్రియ స్థానిక కాంట్రాక్టర్ ల వెనుకంజ

కరింనగర్, డిసెంబర్23(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన (హైబ్రిడ్ యాన్యుటి మోడ్) హ్యామ్ రోడ్లకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమయింది. అయితే కరింనగర్ సర్కిల్ పరిధిలో టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావ టం లేడు. కరీంనగర్ జిల్లాలో ఆర్ అండ్ బి కాంట్రక్టర్ల కు 2022 నుండి 133.21 కోట్ల రూపాయలు బకాయి ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది.

సంవత్సరాలు గడిచిన పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో హ్యామ్ టెండర్ల పై ఆసక్తి చూపడం లేదు. హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉ మ్మడి జిల్లాల్లో మొత్తం 373 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో కొన్ని కొత్తవి కాగా, మరి కొన్ని ఇప్పటికే ఉన్న డ బుల్ రోడ్లను నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు.  ప్యాకేజీల వారీగా అయితే మొత్తం కిలోమీటర్లను 14 ప్యాకేజీలుగా విభజించా రు. వీటిలో ఏవైనా ప్యాకేజీలు పెద్దగా ఉ న్నాయనుకుంటే రెండుగా విభజించాలని నిర్ణ యించారు.

సర్కిళ్ల వారీగా అయితే మొ త్తం కిలోమీటర్లను 16 ప్యాకేజీలు, క్లస్టర్ల వారీగా పనులు చేయాలంటే... 27 ప్యాకేజీలుగా విభజించారు. ఈ విధానాల్లో సర్కిళ్ల ప్రకార మై తే ఇబ్బంది లేకుండా ఉంటుందని, టెండర్ల ప్రక్రియ నుంచి పనుల నిర్వహణ దాకా ఎక్కడా జాప్యం జరగదని అధికారులు అం చనా వేసి టెండర్లను ఆహ్వానించారు.

కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలోహ్యామ్ రొద్దులకి 346.87 కోట్లు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో 573.65 కోట్ల పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నాయి. పనులు ప్రారంభించడానికి 40% పనులు పూర్తయ్యాక 40% మెయింటెనెన్స్ కు 20% చొప్పున ప్రభు త్వం బిల్లులు చెల్లిస్తుంది. టెండర్ల దాఖలకు వారం రోజులు సమయం మాత్రమే ఉంది.

హ్యామ్’ పర్యవేక్షణకు బృందం

హ్యామ్ విధానంలో అభివృద్ధి చేయనున్న రోడ్ల పర్యవేక్షణకు ఆర్‌అండ్బీ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సర్కిల్ పరిధిలో సూపరింటెండెంట్ ఇంజనీర్, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇం జనీర్లు, ఇద్దరు డిప్యూటీ ఇంజనీర్లు, ముగ్గు రు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లతోపాటు మరో ఇద్దరు, ముగ్గురు సిబ్బంది కలిపి బృందాన్ని నియమించనున్నారు.