calender_icon.png 6 July, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

05-07-2025 08:48:37 PM

మండల పశువైద్యాధికారి డా.శిరీష..

చేవెళ్ల: జూనోటిక్‌ వ్యాధుల వ్యాప్తిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ల మండల పశువైద్యాధికారి డా.శిరీష(Veterinary Officer Dr. Sirisha) సూచించారు. ప్రపంచ జూనోసిస్ డే(World Zoonoses Day)ను పురస్కరించుకొని శనివారం మండల పరిధి పల్గుట్ట, ఆలూర్‌ జడ్పీహెచ్‌ఎస్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పల్గుట్టలో మండల పశువైద్యాధికారి డాక్టర్‌ శిరీష, ఆలూర్‌లో ఆలూర్‌ పశువైద్యాధికారి డాక్టర్‌ రాఘవేందర్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ.. జూనోటిక్‌ వ్యాధులనేవి అంటువ్యాధులని, ఇవి జంతువుల నుంచి మానవులకు, జంతువుల ప్రత్యక్ష, లేదా పరోక్షంగా, ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతాయని అన్నారు. మూగ జీవాల పెంపకంలో అవగాహన కలిగి ఉండి, జాగ్రత్తలు పాటించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ పెంపుడు కుక్కలు, పిల్లులకు తప్పకుండా యాంటి రేబిస్ వ్యాక్సిన్‌ వేసుకోవాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, పాఠశాల ప్రాధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.