05-07-2025 08:44:37 PM
ఇంపాక్ట్ ట్రైనర్ శ్రీలత
సూర్యాపేట,(విజయక్రాంతి): విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే లక్ష్యాలను తేలిగ్గా సాధించవచ్చు అని ఇంపాక్ట్ ట్రైనర్ శ్రీలత అన్నారు . శనివారం జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ పక్కన గల సాంఘిక గురుకులంలో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించడం ఎలా అనే అంశంపై ఆమె మాట్లాడారు. అబ్దుల్ కలాం, శీతల్ దేవి లాంటి వారి చరిత్రను ఆదర్శంగా తీసుకొని నేటి యువత అన్ని రంగాలు ముందుకు రావాలని సూచించారు. శారీరక వైకల్యాన్ని అధిగమించి మానసిక ధైర్యాన్ని పెంచుకుంటే అన్ని రంగాల్లో ముందుకు వస్తారని స్పష్టం చేశారు.
నేటి పోటీ ప్రపంచం కి దీటుగా విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకు వస్తూ తమ ప్రతిభను చాటుకోవాలనారు. తల్లిదండ్రుల కలలను ఉపాధ్యాయుల యొక్క శ్రమను గుర్తించి విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలు త్వరగా సాధిస్తారని వివరించారు. చిన్న మోటివేషన్ కథల రూపంలో పిల్లలకు అర్థమయ్యే విధంగా లక్ష్యాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, దానిని రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే అంశంలపై వివరించారు.