calender_icon.png 29 January, 2026 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈసారి మున్సి‘పోల్’ మరింత రసవత్తరం

29-01-2026 12:39:09 AM

  1. గెలుపు భరోసాతో పాటు ధన బలం ఉండాల్సిందే 

గజ్వేల్లో ఆచితూచి అడుగులేస్తున్న పార్టీలు... గజ్వేల్

గజ్వేల్, జనవరి 28: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా జరగనున్నాయి. మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి  బీసీ నా యకులు అధిక సంఖ్యలో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్ని వార్డుల్లో ఆయా పార్టీల కౌన్సిలర్ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు.

బిసి మహిళ రిజర్వేషన్ ఉన్న వార్డుల్లో నాయకులు తమ భార్యలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటు వేసి బలపరచాలని కోరుతున్నారు. పార్టీ టికెట్లు ఖరారు కాకముందే తమ పార్టీలలోని ము ఖ్య నాయకులు ఇచ్చిన భరోసాతో విందులు కూడా కొన్ని వార్డుల్లో ప్రారంభించారు. మ హిళా రిజర్వేషన్ రావడంతో మరికొందరు నాయకులు ఆశలు చాలించుకున్నారు. 

పైసలు ఉంటేనే పార్టీ టికెట్లు - కౌన్సిలర్ టికెట్లకు క్యూలు 

బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల అధిష్టానాలు ఎవరికివారు ప్రత్యేకంగా పార్టీ టికె ట్లు ఆశిస్తున్న అభ్యర్థుల గురించి ఆయా వార్డుల్లో సర్వేలు నిర్వహించారు. తమ సర్వేలలో గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులకు ప్రత్యర్ధులకు దీటుగా ఖర్చును భరించే సత్తా ను కూడా అంచనా వేస్తున్నారు. డబ్బు ఖ ర్చు పెట్టగలిగే స్థాయి ఉన్నవారికి పార్టీలు టి కెట్లను ఖరారు చేస్తున్నాయని ఆయా పార్టీల వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఎలక్షన్ నోటిఫికేష న్ రావడంతో పాటు నామినేషన్లు కూడా ప్రారంభం అవడంతో పార్టీ టికెట్ల కోసం ముఖ్య నాయకులతో చర్చలు తీవ్రమయ్యా యి. బిఆర్‌ఎస్ పార్టీలో ఆశావహులు ఎక్కు వ కాగా , ఇప్పటికే కొందరికి టికెట్లు ఖరారు కావడంతో వేరే పార్టీల వైపు అడుగులు వే స్తున్నారు. పార్టీ ముఖ్య నాయకుల బుజ్జగింపులు కొన్ని వార్డుల్లోనే పనిచేస్తున్నాయి. దీం తో బిఆర్‌ఎస్ పార్టీకి రెబల్స్ ముప్పు పొంచి ఉంది.

అలాగే కాంగ్రెస్ పార్టీలోనూ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఇప్పటివరకు తమకు కౌన్సిలర్ గా అవకాశం వస్తుందని ఆశపడినా, పార్టీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పీఠం గెలుచుకోవడం తప్పనిసరి కావ డంతో గెలిచే అవకాశం ఉన్న వారికే ప్రాధాన్యతనిస్తున్నారు. పలు పార్టీల్లో పార్టీ టికెట్లు రానివారు బిజెపిలో చేరి గెలిచి తమ చాటుకోవాలని ఆ వైపు అడుగులు వేస్తున్నారు.

మూడు పార్టీల్లోనూ అవకాశం రానివారు సి పిఐ, సిపిఎం, టిఆర్పి పార్టీల వైపు చూస్తున్న ట్లు సమాచారం. దీంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారో అన్న చర్చ ప్రజల్లో కొన సాగుతుంది. ఏ వార్డులు, టీ స్టాళ్లు, యువజన, కుల సంఘాలు ఎక్కడ చూసినా ఎన్ని కల చర్చనే కొనసాగుతుంది.