calender_icon.png 21 May, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

29న సురవరం ప్రతాపరెడ్డి జయంతి సభను విజయవంతం చేయండి

21-05-2025 12:29:58 AM

  1. శాసనమండలి చైర్మన్ చేతుల మీదుగా వాల్ పోస్టర్ ఆవిష్కరణ
  2. గోల్కొండ సాహితీ కళా సమితి

ఖైరతాబాద్, మే 20 (విజయక్రాంతి) : తెలంగాణ వైతాళికుడు బహుముఖ ప్రజ్ఞాశాలి గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతి వేడుకలలో భాగంగా ముగింపు సభను ఈనెల 29న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు గోల్కొండ సాహితీ కళా సమితి తెలిపింది. ఈ మేరకు మంగళవారం  శాసనమండలిలో మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా ఎందుకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.

జయంతి ముగింపు సేవకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు నాయకుడు చెరుకుపల్లి సీతారాం, ప్రముఖ కవి  డాక్టర్ ఏను నరసింహారెడ్డి, గోల్కొండ సాహితి కళా సమితి అధ్యక్షులు డాక్టర్ చంద్రప్రకాశ్ రెడ్డి, బడే సాబ్, గంట మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.