calender_icon.png 23 May, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

22-05-2025 12:20:54 AM

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతిస్తారు. మార్చిలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లోనూ విద్యా ర్థులకు ఐదు నిమిషాల సడలింపు ఇచ్చిన విష యం తెలిసిందే. తాజాగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోను ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వర కు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 గంటల నుం చి సాయంత్రం5.30గంటల వరకు సెకండియ ర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 29తో ముగుస్తాయి. ఈసారి 4,13,597 మం ది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 892 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.