calender_icon.png 13 May, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

13-05-2025 01:10:38 AM

జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ 

జగిత్యాల, మే 12 (విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా   జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 13 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు.

సంబంధిత స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువగా చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. బాధితుల సమస్యల తక్షణ పరిష్కారానికి శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్లో పొందుపరుస్తూ, నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీస్ అధికారులు ప్రజలకు పోలీస్ శాఖపై విశ్వసనీయత కలిగేలా పనిచేయాలన్నారు. పలు సమస్యలతో మన వద్దకు వచ్చే బాధితులకు సత్వర జరిగేలా చూడాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు.