13-05-2025 01:10:56 AM
నిజామాబాద్ మే 12: (విజయ క్రాంతి) :నిజామాబాద్ నగరానికి చెందిన శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ విస్సా హెల్త్ ఎక్స్ పురస్కారనికి ఎన్నికయ్యారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అందిస్తున్న వైద్య సేవలను గుర్తించి హైదరాబాదులో నిర్వహించే రాజ్ న్యూస్ విస్సా హెల్త్ ఎక్స్ పురస్కారానికి సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర.
మంత్రులు శ్రీధర్ బాబు , సీతక్క గ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గారు మాట్లాడుతూ ఈ పురస్కారం ఇంకా బాధ్యతను పెంచిందని ఇదేవిధంగా ఎన్నో ఉత్తమమైన సేవలను ప్రజలకు అందిస్తూ ప్రజాసేవలోనే ఉంటానని డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రజలకు హామీ ఇచ్చారు