13-05-2025 12:00:00 AM
మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో..
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సోమవారం హైరిస్క్ ప్రెగ్నెన్సీపై సీఎంఈ (కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ప్రసూతి నిపుణులు, పీడియాట్రిషన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఆరోగ్యరంగ నిపు ణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ ఒబ్జెట్రిషియన్, గై నాకాలజిస్ట్ డాక్టర్ బాలాంబ మాట్లాడుతూ.. “హై రిస్క్ గర్భధారణలు పెరిగిపోతున్న నేపథ్యంలో సమయానుకూలమైన శిక్షణ, క్లినికల్ అవగాహన ఎంతో అవసరం.
మెడికవర్ ఆసుపత్రులు ఈ రంగంలో ముందుం డి మాతృ-శిశు ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహిస్తున్నందుకు అభినందనలు” అన్నారు. ఫోగ్సి మాజీ అధ్యక్షురాలు డాక్టర్ శాంతకుమారి మాట్లాడుతూ.. “ఈ రోజుల్లో మాతృ ఆరోగ్యం సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి సీఎంఈల ద్వారా వైద్య నిపుణులు నైపుణ్యాలను మెరుగుపర్చుకొని సురక్షిత వైద్యం అందించగలుగుతారు” అన్నారు.
మెడికవర్ హాస్పిటల్స్ నెయోనటాలజీ, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ రవీందర్‌రెడ్డి పరిగే మాట్లాడుతూ.. “హై రిస్క్ ప్రెగ్నెన్సీలో ఫలితాలు డెలివరీతో ఆగవు. శిశువుకు తగిన నెయోనటల్ కేర్ చాలా అవసరం. మా సమగ్ర విధానం ద్వారా తల్లి, శిశువుకు ఉత్తమ చికిత్స అందించగలుగుతున్నాం” అని అన్నారు. కన్సల్టెంట్ ఒబ్జెట్రిషియన్, గైనెకాలజిస్ట్ డాక్టర్ మీనాక్షి మాట్లాడుతూ..
జెస్టేషనల్ డయబెటిస్, ప్రీ ఎక్లాంప్షియా, ప్రీటర్మ్ లేబర్ లాంటి సమస్యల పరిష్కారానికి ముందుగానే గుర్తించడం ముఖ్యం. ఈ సీఎంఈ ద్వారా తాజా మార్గదర్శకాలు, వాస్తవ అనుభవాలను పంచుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ రాగారెడ్డి, డాక్టర్ సింధూరి, డాక్టర్ రాధికా, డాక్టర్ కృష్ణ కుమారి, డాక్టర్ సావిత రాథోడ్, డాక్టర్ సురేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.