09-08-2025 12:04:28 AM
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘పరమ్ సుందరి’. తుషార్ జలోటా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా.. ఉత్తరాది అబ్బాయి, దక్షిణాది అమ్మాయి ప్రేమకథతో రూపుదిద్దుకుంటోంది. దినేశ్ విజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఇదే నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌లో జోరు పెంచింది.
ఇందులోభాగంగా ఈ సినిమా నుంచి శుక్రవారం ఓ రొమాంటిక్ గీతాన్ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ‘భీగి శారీ’ పేరుతో రిలీజ్ చేసిన ఈ పాట ఇప్పుడు సోషల్‌మీడియాను హీటెక్కిస్తోంది. సాంగ్ సీజన్‌కు తగ్గట్టుగా ఉందంటూ ఈ పాటను వింటూ యువత ఉర్రూతలూగుతోంది.
ఈ పాటలో నాయకానాయికల డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా జాన్వీ తడిసిన అందాలతో ఆకర్షిస్తోంది. ఈ వానపాటకు అమితాబ్ భట్టాచార్య అందించారు. సచిన్ సంగీత సారథ్యం వహిస్తూ అద్నాన్ సమీ, శ్రేయా ఘోషల్‌తో కలిసి పాడారు.