calender_icon.png 14 September, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేడ బుడగ జంగం కులస్తులకు రాజకీయ రంగంలో ప్రాధాన్యం ఇవ్వాలి

14-09-2025 01:27:09 AM

జేఏసీ చైర్మన్ తూర్పాటి హనుమంతు, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప, రాష్ట్ర అధ్యక్షుడు గగనం శేఖర్

ముషీరాబాద్, సెప్టెంబర్ 13(విజయక్రాంతి): బేడ బుడగ జంగం కులస్తులకు రాజకీయ రంగంలో ప్రాధాన్యత కల్పించాలని బేడ బుడగ జంగం జేఏసీ చైర్మన్ తూర్పాటి హనుమంతు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు గగనం ముంతప్ప రాష్ట్ర అధ్యక్షులు గగనం శాఖలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బేడ బుడగ జంగం కులస్తులకు రాజకీయ రంగంలో ప్రాధాన్యత కల్పించాలి,

బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ బేడ బుడగ జంగం జేఏసీ ఆధ్వ ర్యంలో బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దొడ్డి కొమురయ్య హాల్ లో యూత్ ఫెడరేషన్ నూతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బేడ బుడగ జంగం జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ చైర్మన్ తూర్పాటి హనుమంతు, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప, వ్యవస్థాపక చైర్పర్సన్ గగనం శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షులు గగనం శేఖర్, జెఎసి వైస్ చైర్మన్ గగనం వెంకటస్వామి, విభూతి వెంకటేష్,  హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ 59 కులాలలో బేడ బుడగ జంగం కులం ఒకటి అన్నారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్స రాలు గడుస్తున్నా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రావాల్సిన రిజర్వేషన్లు ఇప్పటివరకు అందడం లేదన్నారు. కనీసం ఒక ఐఏఎస్, ఐపిఎస్ గాని, ఉన్నత స్థాయి ఉద్యోగాలు బేడ బుడగ జంగం కులంకు లేవన్నారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలు పరిచి గవర్నర్ ఆమో దముద్ర వేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఎస్సీలో గ్రూప్-1 లో కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బేడ బుడగ జంగాలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర యూత్ ఫెడరేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.

రాష్ట్ర అధ్యక్షులుగా వారణాసి శివవర్మ, ఉపాధ్యక్షులుగా గగనం గణేష్, మోతే యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా మోతి నిరంజన్, కోశాధికారిగా రాచూరి శ్రీనివాసులు, రాష్ట్ర కమిటీ సభ్యులుగా 30 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సిరుపాటి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి చల్ల బాలరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పాటి శ్రీనివాసులు, గడ్డం కృష్ణ, సిరివాటి మసికొండ, మిర్యాల తిరుపతి, చల్ల వెంకటేష్, దూపం అంజనేయులు, కోశాధికారి తూర్పాటి చిన్నకోటయ్య, తూర్పాటి హనుమంతు, గగనం రాజు, సిరుపాటి రామకృష్ణ, సిరిసాల రంగన్న, తూర్పాటి మహేష్, గగనం శివుడు, వారణాసి చందు, పస్తం యాకయ్య, పస్తం రాజు తదితరులు పాల్గొన్నారు.