13-08-2025 01:30:05 AM
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాం తి): బీజేపీలో చేరేందుకు చాలా మంది వస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యం లో.. కమలం పార్టీలో చేరాలనుకొనే వారికి ఆ పార్టీ మాజీనేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జర భద్రం అంటూ సలహా ఇ స్తున్నారు. పార్టీలో చేరిన తర్వాత చేరిన వా రు కోరుకున్నది వారి అసెంబ్లీలో, వారి జి ల్లాలో, వారి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎట్టిపరిస్థితుల్లోనూ జరగదని స్పష్టం చేశారు.
నమ్ముకున్న కార్యకర్తలకు ఏమాత్రం న్యాయం చేసే పరిస్థితి బీజేపీలో ఉండదంటూ మంగళవారం ప్రకటనలో పేర్కొ న్నారు. పార్టీ టికెట్ వస్తుందనే గ్యారెంటీ కూడా ఉండబోదన్నారు. పార్టీలో చేరిన రోజు మొదటి సీట్లో ఉంటారని.. తర్వాత లాస్ట్ సీట్లోకి నెట్టేస్తారని సూచించారు. తన నియోజకవర్గంలో 11 ఏళ్లుగా అణచివేతను ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను కార్యకర్తల కోసం ఏమీ చేయలేకపోయా నని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయశాంతి, జితేందర్‌రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి లాంటి వాళ్లు బీజేపీ ని ఎందుకు వీడాల్సి వచ్చిందో వారితో ఓసారి మాట్లాడితే అవగాహన వస్తుందన్నారు. హిందుత్వానికి, దేశానికి, సమాజా నికి చాలా మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని.. కానీ తెలంగాణలో ఇది తమ అబ్బ సొత్తుగా అనుకునే వారి వల్లే పార్టీ సర్వనాశనమైందన్నారు. బీజేపీలో తాము ఏం చెప్తే అదే జరుగుతుందని..
ఏది రాస్తే అదే రాజ్యమవుతుందని భావించే వ్యక్తుల వల్లే పార్టీ సర్వనాశనం అయిందన్నారు. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులోనైనా తెలంగాణలో రాక్షసులు నాశనమవుతారని జోష్యం చెప్పారు. కార్యకర్తల ఆశీస్సులతో బీజేపీనే రాష్ట్రాన్ని పాలిస్తుందని.. బీజేపీ నేత సీఎం అవుతారని భరోసా వ్యక్తం చేశారు.