calender_icon.png 13 August, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగ ఓట్లు తొలిగితేనే రాహుల్ ప్రధాని

13-08-2025 01:27:50 AM

  1. దారుస్సులాంలోనూ దొంగ ఓట్లున్నాయ్
  2. దమ్ముంటే అసదుద్దీన్ సికింద్రాబాద్‌లో పోటీచేసి గెలవాలి 
  3. బీజేపీకి ఎంఐఎం బీ టీమ్: ఫిరోజ్ ఖాన్ 

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): దొంగ ఓట్లను గుర్తించకపోతే రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడం కష్టమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ పేర్కొన్నారు. ఓటు చోరి అంశాన్ని రాహుల్‌గాంధీ ఎత్తుకోవడం సంతోషకరమని, ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌కు తాను డిక్లరేషర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఫిరోజ్ ఖాన్ తెలిపారు.

మంగళవారం ఫిరోజ్‌ఖాన్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని పాతబస్తీలోని దారుస్సలాంలోనూ దొంగ ఓట్లు తయావుతాయని ఆరోపించారు. అసదుద్దీన్‌కు దమ్ముంటే పాతబస్తీలో కాకుండా సికింద్రాబాద్‌లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఎన్నికల సంఘం డిజిటల్ జాబితాను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని డిమాండ్ చేశా రు. ఎన్నికల ఫ్రాడ్ అనేది ప్రజాస్వామ్యంపై అతిపెద్ద దాడి అని విమర్శించారు. 

ఇది పొలిటికల్ ఫైట్ కాదని, సేవ్ డెమోక్రసీ మాత్రమేనని ఆయన తెలిపారు. నాంపల్లి నియోజకవర్గంలో బోగ స్ ఓట్లు, రౌడీయిజం కారణంగానే తాను కేవలం 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోయినట్టు ఫిరోజ్ ఖాన్ చెప్పారు. నాంపల్లి లోని దొంగ ఓట్లను తొలగించాలని అనేకసార్లు ఉన్నతాధికారులను కలిసినా ప్రయో జనం లేకుండా పోయింద న్నారు. డూప్లికేట్ ఐడీలో కొత్త ఓటర్లను సృష్టించారని, దొంగ ఓట్లు వేస్తున్న ముగ్గురిని పట్టుకుంటే..

వారు ఓవైసీ మనుషులుగా గుర్తించి నట్టు చెప్పారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదని ఆయన విమర్శించారు. హైదరా బాద్‌లో ఎంఐఎం చేసే పని, దేశంలో బీజేపీ చేస్తోందని మండిపడ్డారు.

ఐదేళ్ల కొట్లాడితే పది శాతం ఓట్లు తొలగించారని, అది కూడా చనిపోయిన వారి పేర్లు మాత్రమేనన్నారు. బీజేపీకి ఎంఐఎం ఎంపీ అసదు ద్దీన్ ఓవైసీ బీ టీమ్‌గా మారాడని ఫిరోజ్‌ఖాన్ ఆరోపించారు. పాతబస్తీని చెత్తబుట్టగా మార్చిన అసద్‌కు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వస్తుందని ఎద్దేవా చేశారు. ఎంఐ ఎం పార్టీకి దమ్ముంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవాలని ఆయన సవాల్ విసిరారు.