27-08-2025 12:19:52 AM
బెల్లంపల్లి, ఆగస్టు 26: బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మంగళవారం జ్వర పీడితులతో కిక్కిరిసిపోయింది. మంగళవారం ఒక్కరోజే ఈ ఆసుపత్రికి 600కు పైగా రోగులు చికిత్స కోసం రాగా అందులో 400 మందికి పైగా జ్వరం సోకిన వారే ఉండడం గమనార్హం. 200కు పైగా జ్వర పీడితులు ఈ ప్రాంతీయ ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్సలు పొందుతున్నారు.
చాలీచాలని వైద్యులు, సిబ్బంది ఉన్నప్పటికీ ఈ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయని జ్వర పీడితులు తెలిపారు. జ్వర పిడుతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఏరియా ఆసుపత్రిలో 100 బెడ్లు మాత్రమే ఉన్నప్పటికీ 136 మందిని ఇన్ పేషెంట్లుగా చేర్చుకొని అత్యవసర వైద్య చికిత్సలను అందిస్తున్నట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు.