calender_icon.png 27 August, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో ఘనంగా వినాయక చవితి

27-08-2025 02:21:49 AM

కొత్తపల్లి, ఆగస్టు 25 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో వినాయక చవితి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆల్ఫోర్స్ వి ద్యాసంస్థల నిర్వాహకులు డాక్టర్ వి వనజా సురేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేసి అట్టహాసంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రేమకు ప్రతీక, సోదర భావానికి నిర్వచనం అయిన విఘ్నేశ్వరుడిని అన్నివేళల్లో పూజించడం చాలా శ్రేయస్కరమని, శుభఫలాలు ఇస్తాయని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన గణేశుని చరిత్ర, నవరాత్రి ఉత్స వాల వైభవం నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులుపాల్గొన్నారు.