27-08-2025 02:26:03 AM
హైదరాబాద్,సిటిబ్యూరో ఆగస్టు 25 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పాశమైలా రం లోని సిగ్నాచి ఇండస్ట్రీస్‌లో 50 మందికి పైగా కార్మికులను బలిగొన్న ఘోర పేలుడు ఘటనపై పౌర సమాజం భగ్గుమంది. ఇది ప్రభు త్వాలు, పరిశ్రమల యాజమాన్యాలు చేస్తున్న పారిశ్రామిక హత్యలేనని, ఈ నిర్లక్ష్యాన్ని ఇకపై సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించింది. తెలంగాణలో సురక్షితమైన పని ప్రదేశాల కోసం తక్షణమే భద్రతా సంస్కరణలు చేపట్టాలని ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. సైంటిస్ట్స్ ఫర్ పీపుల్, హ్యూమన్ రైట్స్ ఫోరం, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్ష న్ కమిటీ, వర్కింగ్ పీపుల్స్ కోయలిషన్ సంయుక్తంగా మంగళవారం మాంట్ ఫోర్ట్ సోషల్ ఇన్‌స్టిట్యూట్ లో ఓ వర్క్‌షాప్‌ను నిర్వహించాయి.
ఈ కార్యక్రమానికి సిగ్నాచి ఘటనలో మరనించిన కుటుంబసభ్యులు హాజరై తమ కన్నీటి గాథలను పంచుకోవడం పలువురిని కదిలిం చింది. మాంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన బ్రదర్ వర్గీస్ థెక్కనాథ్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు పారిశ్రామికవృద్ధికి ఇస్తున్న ప్రాధా న్యం కార్మికుల ప్రాణాలకు ఇవ్వడం లేదన్నారు. శాస్త్రవేత్త డా.బాబూరావు మాట్లాడు తూ, ఈ మరణాలు నివారించగలిగేవే. కానీ, ప్రభుత్వాలకు రాజకీయ సంకల్పం లేకపోవడం వల్లే ఇలాం టి దుర్ఘటనలు పునరావృతమవుతున్నాయన్నారు.
న్యాయవాది అఖిల్ సూర్య మాట్లా డుతూ, పాత చట్టాలతో కార్మికులకు న్యా యం జరగడంలేదన్నారు. కొత్త గా తెచ్చిన లేబర్ కోడ్‌లు రాష్ట్రాల అధికారాలను మరిం త తగ్గించాయన్నారు. ఎక్స్‌గ్రేషియా చెల్లింపులతో చేతులు దులుపుకోవడం కాదు, యాజ మాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో సాగర్, ధార, రవి కన్నెగంటి, డా. పీజీ.రావు, పలువురు శాస్త్రవేత్తలు, కార్మిక, ట్రేడ్ యూనియన్ల నాయకులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.