27-08-2025 02:24:46 AM
కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ జాయింట్ సెక్రటరీ రమ్యారావు
చొప్పదండి, ఆగస్టు 26 (విజయక్రాంతి): అధికారంలో ఉండీ ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వ స్తున్నదని కాంగ్రెస్ కాంపెయిన్ కమిటీ జాయింట్ సెక్రటరీ రేగులపాటి రమ్యారావు మంగళవారం పేర్కొన్నారు.
సోమవారం గంగాధర మండలం వెంకటాయపల్లిలో ఏఐసీసీ జనరల్ సె క్రటరీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేహ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పని చేసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని హామీ ఇచ్చారని, ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మ హేశ్‌కుమార్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.