27-08-2025 12:53:56 AM
రైతు పొలంలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
నవాబ్ పేట: శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గురువారం నవాబ్ పేట్ మండల పర్యటనలో భాగంగా చౌడూరు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని రైతు పంట పొలానికి స్వయంగా వెళ్లి, యూరియా ఎరువును తానే స్వయంగా చల్లడం ద్వారా రైతులతో మమేకమయ్యారు.ఈ సందర్భంగా ఆయన రైతులతో నేరుగా మాట్లాడి పంటల పరిస్థితి, ఎరువుల లభ్యత, మార్కెట్ సౌకర్యాలు, భూగర్భ జలాల సమస్యలపై ఆరా తీశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఓర్పుగా విని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం దశల వారీగా చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు.