calender_icon.png 10 January, 2026 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడుకగా ఎమ్మెల్యే మేఘారెడ్డి జన్మదినం

09-01-2026 12:00:00 AM

రక్తదానం చేసిన అభిమానులు

వనపర్తి, జనవరి 8 (విజయక్రాంతి): వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జన్మదినం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబి రంలో రికార్డ్ స్థాయిలో రక్త సేకరణ జరిగిం ది. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం యువశక్తి ఫౌండేషన్ సమన్వయం ద్వారా 482 యూనిట్ల రక్తాన్ని స్వీకరించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మొదటగా  ఖిదటగా ఘణపురం మండలం గట్టు కాడిపల్లి శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కుటుంబ సమేతం గా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వనపర్తి మండలం చిట్యాల గ్రామ శివారులోని చేయూత అనాధాశ్రమం వారు వృద్ధులకు భోజన పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే భోజనాన్ని సరఫరా చేసేందుకు కావలసిన వాహనాన్ని గతంలోనే అనాదాశ్రమానికి వితరణ చేశారు. పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో అనాధ వృద్ధులకు భోజనం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పామి రెడ్డిపల్లి పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు.

వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల మధ్యన మార్కెట్ యార్డ్ కార్మికుల మధ్యన ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలకు ఎ మ్మెల్యే కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కాంగ్రె స్ పార్టీ నాయకులు కార్యకర్తలు. ప్రముఖులు అధికారులు యువకులు, మహిళలు ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.