26-05-2025 10:34:45 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం అయిన కాళేశ్వరం(Kaleswaram) వద్ద సరస్వతి పుష్కరాల్లో భాగంగా చివరి రోజున మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఓడితల ప్రణవ్ బాబు సరస్వతి పుష్కరాల్లో సోమవారం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుణ్యస్నానమాచరించి సాయంత్రం నిర్వహించిన మహా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 12 ఏళ్ల ఒక్కసారి వచ్చే సరస్వతి పుష్కరాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రభుత్వం తరఫున పుష్కరాలకు సమృద్ధిగా నిధులు కేటాయించామని, తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకొని పుష్కరాలను విజయవంతం చేశామని తెలిపారు.