calender_icon.png 7 May, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్లపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి

07-05-2025 01:20:12 AM

  1. నిరుపేద లైన లబ్ధిదారులకు డ్వాక్రా ద్వారా రుణాలు 
  2. జిల్లా కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్ ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష 

భద్రాద్రి కొత్తగూడెం మే 6 ( విజయ క్రాంతి) అర్హులైన నిరుపేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఎల్ల నిర్మాణం పై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పైలట్ గ్రామా ల్లో ఇందిరమ్మ ఎల్ల పురోగతి, లబ్ధిదారుల ఎంపికపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఎంపికైన పైల ట్ గ్రామాల్లో 878 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 49 ఇండ్లకు బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం జరిగిందని, 370 లబ్ధిదారులకు మొదటి విడతల్ రూ 1 లక్ష ఆర్థిక సహాయం విడుదల చేశామన్నారు. మిగిలిన గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో లబ్ధి దారల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.

మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పైలట్ ప్రాజెక్టు మంజూరు చేసిన ఎల్ల పురోగతి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎంపికపై మండలాల వారీగా అధికారులకు పలు సూచనలు చేశారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు ఒక గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో గ్రౌండ్ చేసే ముందు సంబంధిత అధికారులకు మేస్త్రీ లకు మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇండ్లను చూపించి తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇంటిని ఎలా నిర్మించు కోవాలో గృహ నిర్మాణ శాఖ ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన అసిస్టెంట్ ఇంజనీర్ ద్వారా అవగాహన కల్పించాలన్నారు.

మండల కేంద్రాల్లో జరుగుతున్న మోడల్ ఇందిరమ్మ ఎల్ల నిర్మాణం పురోగతి వివరాలు ప్రతి భారం రిపోర్ట్ అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం నాలుగు విడతల్లో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తుందని మొదటి విడత పెట్టుబడి పెట్టలేని నిరుపేదలు ఉంటే వారికి డ్వాక్రా ద్వారా రుణాలు  అందజేస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా 14,763 ఏందిరమ్మాయిలు కేటాయిస్తే, 10,921 దరఖాస్తులు సర్వే చేసి, 9, 150 దరఖాస్తులకు అర్హత ఉందని గుర్తించామన్నారు.

తుది లబ్ధిదారుల జాబితా ర్యాన్ డం చెక్ చేసి అర్హులకు మాత్రమే జాబితాలో చోటు కల్పించారా, లేదా గమనించి వివరాలు అందజేయాలన్నారు. ర్వాండమ్ చెక్ పూర్తి చేసుకున్న తర్వాత ఎంపిక చేసిన అర్హుల జాబితాను ఆమోదం తీసుకొని గ్రౌండ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జడ్పీ సీఈవో దీక్షరైనా, డి ఆర్ డి ఓ  సన్యాస య్య, గృహ నిర్మాణ శాఖ ఈఈ బి శ్రీనివాస్,డీఈవో సత్యనారాయణ తాసిల్దార్లు , మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.