calender_icon.png 25 July, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువు ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది

24-07-2025 12:33:25 AM

సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహ ఆవిష్కరణ లో మంత్రి వాకిటి శ్రీహరి 

చిన్న చింతకుంట జూలై 23 : చదువు ఒక్కటే ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.బుధవారం చిన్న చింతకుంట మండలం లోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల లో సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహ ఆవిష్కరణను, కౌ కుంట్ల మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి,

గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించి, కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి గ్రామంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ ని ర్మాణ భూమి పూజ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో కలిసి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టుదలతో విద్యార్థులు చదవాలని ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.

ప్రతి ఒక్కరి సంతోషం కోసం ప్రభుత్వం ప్రతిక్ష ణం శ్రమిస్తుంది అని తెలిపారు. గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం పండుగా వాతావరణంలో కనిపిస్తుందని పేర్కొన్నారు. దేవరకద్ర నియోజకవర్గం ను ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఎంతో ముం దు చూపుతో ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారని తెలియజేశారు. ప్రోత్సహిస్తున్నామన్నారు.

స ర్వేపల్లి రాధాకృష్ణన్ మాదిరిగానే ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులను తమ పిల్లలు గా భావించి మంచి విద్యను మంచి విద్య బోధన అందించడంతోపాటు మంచి విలువలను నేర్పాలని ఆయన సూచించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం అందించడం జరిగిందన్నారు.అనంతరం విద్యార్థులకు చెస్ బోర్డు లను, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో అడి షనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఎంఈఓ మురళీకృష్ణ , వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కథలప్ప, విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, పార్టీ నాయకులు వట్టెం శివకుమార్, ఎస్ వెంకటేష్, మాజీ సర్పంచ్ వెంకటేష్, వెంకటేష్ ముదిరాజ్, గంజి బాలరాజ్, గూడూరు శేఖర్, శ్రీనివాస్ గౌడ్ ,శేఖర్ ,ప్రతాప్, సిఆర్పిలు విజయసింహ, ప్రవీణ్, లతోపాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.