calender_icon.png 24 November, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో బెంగాల్ టైగర్స్

27-01-2025 11:30:27 PM

కళింగపై సుర్మా, ఢిల్లీపై బెంగాల్ విజయాలు 

హాకీ ఇండియా లీగ్...

భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్‌లో బెంగాల్ టైగర్స్ సెమీస్‌లో అడుగుపెట్టింది. రూర్కెలా వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ 2 తేడాతో ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌ను చిత్తు చేసింది. రూపిందర్ సింగ్ (55వ ని.లో), సెబాస్టియన్ (59వ ని.లో) బెంగాల్‌కు గోల్స్ అందించగా.. టోమస్ డొమినె (27వ ని.లో) ఢిల్లీ తరఫున ఏకైక గోల్ నమోదు చేశాడు. రెండో లీగ్ మ్యాచ్‌లో సుర్మా హాకీ క్లబ్ 5 వేదాంత కళింగ లాన్సర్స్‌పై విజయాన్ని నమోదు చేసుకుంది. సుర్మా తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (ఆట 32వ, 54వ నిమిషంలో) డబుల్ గోల్స్‌తో మెరవగా.. ప్రభ్‌జోత్ (26వ ని.లో), నికోలస్ కీనన్ (33వ ని.లో), మనిందర్ (51వ ని.లో) గోల్స్ సాధించగా.. కళింగ లాన్సర్స్ తరఫున దిల్‌ప్రీత్ (5వ ని.లో), బ్రింక్‌మన్ (44వ ని.లో), గుర్సజిత్ (56వ ని.లో) గోల్స్ అందించారు. నేడు జరగనున్న మ్యాచ్‌లో టీమ్ గొనాసికాతో హైదరాబాద్ తుఫాన్స్ తలపడనుంది.