calender_icon.png 24 November, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధిక్యంలో గుకేశ్, ప్రజ్ఞానంద

27-01-2025 11:33:05 PM

టాటా స్టీల్ చెస్ టోర్నీ...

ఆమ్‌స్టర్‌డామ్: టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. సోమవారం ఎనిమిదో రౌండ్‌లో ప్రపంచ చాంపియన్ గుకేశ్ దొమ్మరాజుతో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞా డ్రా చేసుకున్నప్పటికీ అబ్దుసత్రోవ్, గుకేశ్‌తో కలిసి 5.5 పాయింట్లతో టాప్ స్థానంలోనే కొనసాగుతున్నాడు. మిగిలిన గేముల్లో హరిక్రిష్ణ.. అనీశ్ గిరితో, అలెక్సీ సరానాతో అర్జున్, జోర్డెన్ వాన్‌తో లూక్ మెండోన్కా డ్రా చేసుకున్నారు. 8 రౌండ్లు ముగిసేసరికి ప్రజ్ఞానంద, గుకేశ్, అబ్దుసత్రోవ్ తలా 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. వ్లాదిమిర్ ఫెడోసీవ్ (5 పాయింట్లు), రెండో స్థానంలో ఉండగా.. ఫాబియానో కరూనా, వెయ్ యి, అలెక్సీ సరానాలు 4.5 పాయింట్లతో మూడో స్థానంలో,  హరికిష్ణ్ర 4 పాయింట్లతో నాలుగోస్థానంలో, చివరి మూడు స్థానాల్లో అనీశ్ గిరి (3.5), మాక్స్ వర్మెర్‌డమ్ (3), అర్జున్ ఇరిగేసి (2) ఉన్నారు. చాలెంజర్స్ విభాగంలో దివ్య దేశ్‌ముఖ్ మరో ఓటమిని మూటగట్టుకోగా.. ఆర్.వైశాలీ మాత్రం అర్థుర్ పిజ్‌పర్స్‌తో డ్రా చేసుకుంది. టోర్నీలో మరో ఐదు రౌండ్లు మిగిలి ఉన్నాయి.