24-05-2025 01:54:06 AM
-42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం
-రాణించిన ఇషాన్ కిషన్, కమిన్స్
లక్నో, మే 23: ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగు వరుస విజయాల తర్వాత ఓటమి చవిచూసింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 42 పరుగుల తేడాతో బెంగళూరుపై విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 94 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. అభిషేక్ శర్మ (34) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో రొమారియో షెపర్డ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఫిల్ సాల్ట్ (62), కోహ్లీ (43) దనాధన్ ఇన్నింగ్స్‌లతో అలరించినప్పటికీ మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు తీయగా.. మలింగ 2 వికెట్లు పడగొట్టాడు. నేడు జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్‌తో ఢిల్లీ తలపడనుంది.