calender_icon.png 27 July, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలి

26-07-2025 06:26:13 PM

జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్..

గద్వాల (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులలో మాతృ మరణాలు సంభవించకుండ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్(District Collector B.M. Santosh) అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగిన మాతృ మరణాలపై, వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జోగులాంబ గద్వాల జిల్లాలో ఎక్కడా కూడా మాతృ మరణాలు జరగకుండా వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పని చేయాలని లేనిచో శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు.

మాతృ మరణాలు సంభవించకుండా వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశలు, సమన్వయం చేసుకుంటూ గర్భిణీ స్త్రీలను, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆర్ఎంపి లు ప్రథమ చికిత్సలు మాత్రమే నిర్వహించాలని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వరాదని ఒకవేళ ఇచ్చినచో అటువంటి ఆర్.ఎం.పి. లపై క్రిమినల్ కేసు నమోదు చేయమని జిల్లా వైద్యాధికారిని జిల్లా కలెక్టర్  ఆదేశించారు. బింగిదొడ్డి గ్రామంలో బాలింతకు,  డాక్టర్ ప్రెస్క్రిప్షన్  లేకుండా ఆర్.ఎం.పి. వైద్యుడు ఇంటిదగ్గర ఇంజక్షన్ వేయడం ద్వారా బాలింత మృతి చెందడం జరిగిందని, ఆ బాలింత మృతికి కారణమైన ఆర్ఎంపిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కలెక్టర్ జిల్లా వైద్య అధికారికి ఆదేశించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే వైద్యాధికారులు ఫీల్డ్ సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, హై రిస్క్ లక్షణాలు ఉన్న గర్భిణీ స్త్రీలను, బాలింతలను ప్రతిరోజు తప్పనిసరిగా గృహ సందర్శన చేసి మాతృ మరణాలను అరికట్టాలని వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్యాధికారులు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బృందం జిల్లాల్లోని అన్ని ప్రైవేట్ ఆసపత్రులను సందర్శించి ప్రైవేట్  ఆసుపత్రులలో యాజమాన్యం వారు స్టెర్లైజ్డ్ ఆపరేషన్ మెజర్స్ పాటిస్తున్నారా లేదా అని చూడాలని  ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్య అధికారి సిద్ధప్ప, మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం ఆఫీసర్ డా. ప్రసూన రాణి, ఇటిక్యాల ప్రాథమిక కేంద్రం వైద్యాధికారి డా. రాధిక, గట్టు ప్రాథమిక కేంద్రం వైద్యాధికారి డా. రమేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది, తిరుమలేష్ రెడ్డి (ASO), నరసయ్య, హెల్త్ అసిస్టెంట్, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఆశాలు  పాల్గొన్నారు.