calender_icon.png 27 July, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నియంత్రణకు కృషి చేయాలి

26-07-2025 06:23:40 PM

జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటిని అదుపు చేయడానికి మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్(District SP Kantilal Patil) అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షించారు. నేరాల నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు, పెండింగులో ఉన్న కేసుల వివరాలు, కేసుల పరిష్కారానికి అధికారులు చూపిస్తున్న చొరవ, నేరాలకు పాల్పడిన నేరస్తులకు కోర్టులో శిక్షలు పడే విధంగా తీసుకుంటున్న ముందస్తు చర్యలను ఎస్పీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖ పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజా మన్ననలు పొందేలా ముందుకు సాగాలన్నారు.

పెరిగిపోతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలన్నారు. ముఖ్యంగా నిఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మారిన సిసిటీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ లో సిసి కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. నేరం చేసే వాడికి శిక్ష పడాలి, నేరం చేయని వారికి రక్షణగా ఉంటూ,సమర్ధ సేవలు ప్రజలకు అందాలన్న సంకల్పంతో పోలీస్ శాఖ లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. అదే విధంగా మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన, సత్వర సేవలు అందించాన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో పోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్, SC/ST కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేసి కోర్ట్ లో ఛార్జ్ సీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవసరమైన అన్ని రకాల రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించడం, రద్దీ గల ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు సంబంధిత శాఖలు, ప్రజలను సమన్వయం చేస్తూ వాటిని అధిగమించేలా ముందుకు సాగాలన్నారు. జిల్లాలో దొంగతనాలు నివారణకు  రాత్రి, పగలు పెట్రోలింగ్ నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నాకాబంది, కార్డెన్ అండ్ సెర్చ్, వాహన తనిఖీ లాంటి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని అన్నారు. రౌడీ షీట్స్, సస్పెక్ట్స్, పాత నేరస్థుల పై నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ (VPO) వ్యవస్థ తో ప్రజలు పోలీస్ వ్యవస్థ యొక్క సేవలను వినియోగించుకునేలా, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని అన్నారు. సైబర్ నేరాల ఆన్ లైన్ బెట్టింగ్, లోన్ యాప్ ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు అక్రమ గంజాయి,జూదం,పీడీఎస్ బియ్యం,అక్రమ ఇసుక రవాణా వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో  ఏఎస్పీ చిత్తరంజన్, డిసిఆర్బి డిఎస్పి విష్ణుమూర్తి, సీఐలు, ఆర్.ఐ లు, యస్.ఐ లు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.