calender_icon.png 27 July, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుజాతనగర్ పోలీస్ స్టేషన్ లో తనిఖీ చేసిన ఓఎస్డీ

26-07-2025 06:28:33 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ను శనివారం కొత్తగూడెం ఓ ఎస్ డి గోపతి నరేందర్(OSD Gopathi Narender) ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను, స్టేషన్ సెక్యూరిటీ విధానంను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. స్టేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు నక్సలైట్ల విధివిధానాలపై అవగాహన కలిగి ఉండాలని, సమాచారం సేకరించాలని, విధి నిర్వహణలో అలర్ట్ గా ఉండాలని, స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి గ్రామాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆయన వెంట చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై మాలో రమాదేవి పాల్గొన్నారు.