19-11-2025 12:19:31 AM
భద్రాద్రి, నవంబర్ 18 (విజయక్రాంతి): రుద్రంపూర్ జయశంకర్ గ్రౌండ్,రామవరం కమ్యూనిటీ హాల్, లకు మెరుగైన వసతులు కల్పించాలని, ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి. రజాక్ ను కోరడమైనది, రజాక్ ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజును, కలిసి రుద్రంపూర్ జయశంకర్ గ్రౌండ్ నందు వాకింగ్ ట్రాక్, మరియు వెహికల్స్ పార్కింగ్ కోసం స్థలం ఏర్పాటు చేయాలని, కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా లెవెల్ కబడ్డీ పోటీలు నిర్వహించనున్న సందర్భంగా, రన్నింగ్ ట్రాక్ మరియు ఆటలు వీక్షించడానికి గ్యాలరీలు ఏర్పాటు చేయాలని, అదే విధంగారామవరం కమ్యూనిటీ హాల్ నందు బోరింగ్ కు పంపు మోటార్ బిగించాలని, కమ్యూనిటీ హాల్ నందు ఏ/సీలు బిగించాలి, అలాగే పార్కింగ్ స్థలంలో చుట్టూ గోడలపై, సోలార్ మెష్ ఏర్పాటు చేయాలి, కమ్యూనిటీ హాల్ ఓపెన్ స్టేజ్ ఎదురుగా ఉన్న స్థలంలో, లెవెల్ చేయించి ఫ్లోరింగ్ చేయాలని, కోతుల బెడద ఎక్కువ ఉన్నందున కమ్యూనిటీ హాల్ చుట్టూ ఉన్న గోడలపై సోలార్ మెష్ ఏర్పాటు చేయాలి, వాష్ బేసిన్ ఏరియాలో ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేయాలి, కమ్యూనిటీ హాల్ ఎంట్రన్స్ నందు రెండవ గేట్ ఏర్పాటు చేయాలని,ఆవులు జంతువులు రాకుండా క్యాటిల్ గార్డ్ ఏర్పాటు చేయాలి, కిచెన్ పక్కన స్టోర్ రూమ్ ఏర్పాటు చేయాలి, డైనింగ్ మరియు కిచెన్ మధ్యలో చిన్న బిట్టు ఫ్లోరింగ్ చేయించాలి, స్టేజ్ ముందు రెండు లైటింగ్ కొరకు టవర్స్ ఏర్పాటు చేయాలి, కొత్తగూడెం ఏరియాలో చుట్టుపక్కల ఉన్న కార్మిక కుటుంబాలు కోరుచున్నారు, కొత్తగూడెం ఏరియా ఐఎన్టియుసి ట్రేడ్ యూనియన్ ద్వారా పైన తెలిపిన పనులను త్వరగా పూర్తి చేయించాలని కోరారు.