23-08-2025 12:36:54 AM
38 తులాల బంగారం, 21 డాక్యుమెంట్లు కూడా
నిందితుల బ్యాంక్ ఖాతాలు నిలిపివేత
వెల్లడించిన నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్ ఆగస్టు 22 (విజయక్రాంతి): జిల్లా బైంసా పట్టణ కేంద్రంగా బెట్టింగ్ యాప్ ని ర్వహిస్తున్న ప్రధాన నిందితుడు సయ్యద్ అ జాంను శుక్రవారం అరెస్టు చేసినట్టు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ అవినాశ్ కుమార్‌తో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో వివరాలను ఎస్పీ వెల్లడించారు.
ని ర్మల్ జిల్లాలో గత కొన్ని రోజులుగా బెట్టింగ్ జోరుగా సాగుతున్నట్టు సమాచారం రావడంతో బెట్టింగ్ కేంద్రాల నిర్వహణపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. భైంసా పట్టణంలో సయ్యద్ ఇర్ఫాన్, సయ్యద్ అజాం అనే ఇద్దరు వ్యక్తులు మీసేవ నిర్వహి స్తూ ఆల్ పాన్కాన్ యాప్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు తెలిసిందన్నా రు. దీనిపై భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్, సీఐ గోపీనాథ్ నేతృత్వంలో పోలీస్ బృందం విచారణ జరిపిందన్నారు.
బెట్టింగ్‌కు పాల్పడుతున్న సయ్యద్ ఇర్ఫాన్‌కు ముఖ్య అనుచరుడిగా ఉన్న సయ్యద్ అజాంను గుర్తించామన్నారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. అతని వద్ద నుంచి 16.30 లక్షల నగదు, 38 గ్రాముల బంగా రం. 21 డాక్యుమెంట్లు. రెండు బంగారం బిస్కెట్లు, లక్ష రూపాయల విలువ చేసే రోల్ గోల్డ్, మూడు సెల్ ఫోన్లు, ఏటీఎం కార్డు, పాన్ కార్డ్ ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారి బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేయడం జరిగిందని తెలిపారు.
ఇప్పటికే ఎనిమిది మంది అరెస్ట్
అజాం వద్ద బెట్టింగ్‌కు పాల్పడ్డ పి.మణికంఠ, సీహెచ్.శివాచారి, సయ్యద్ రహిమాన్, లక్కాకుల నరేశ్, కారేగాం ప్రణయ్, చేయని కళ్యాణ్, సయ్యద్ ఇర్ఫాన్, చిట్యాల వెంకటేశ్ అనే ఎనిమిది మంది వ్యక్తులను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ తరలించామని తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లను పోలీస్ శాఖ కఠినంగా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
బెట్టింగ్‌కు పాల్పడ్డా, పెట్టుబడులు పెట్టిన చట్టరీత్యా నేరమన్నారు. బెట్టింగ్ సూత్రధారైన సయ్యద్ అజాంకు గతంలో కూడా నేర చరిత్ర ఉందని ఎస్పీ తెలిపారు. బెట్టింగ్ నిర్వహించడం చట్టరీత్యా నేరమని, దానికి ఎవరు పాల్పడినా వారిపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడులు పెట్టి ఇప్పటికే చాలామంది నష్టపోయారని, అటువంటి యాప్‌లకు ప్రజలు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఈ కేసులు ఛేదించిన ఏఎస్పీ అవినాశ్ కుమార్, సీఐ గోపీనాథ్, పోలీస్ సిబ్బంది రేవంత్‌రావు, బాలాజీ, ప్రమోద్, క్రాంతి కుమార్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.