23-08-2025 12:36:38 AM
ఇబ్రహీంపట్నం ఆగస్టు 22:తమతో చదివిన స్నేహితురాలి భర్త ఆకాల మరణం చెందిన విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన స్వప్న, మంచాల మండల కేంద్రానికి చెందిన వెంకటేష్ కు గత 10 సంవత్సరాల క్రితం వివాహం అయింది. కాగా ఇటీవల ఆమె భర్త కానిస్టేబుల్ వెంకటేష్ హార్ట్ ఎటాక్ తో అకాల మ రణం చెందాడు. తోటి స్నేహితురాలి కుటుంబానికి సహాయం చేయాలనే ఆలోచనతో కొంత డబ్బు జమ చేశారు. అలా పోగుచేసిన రూ.63 వేలు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి బాసటగానిలిచారు.