calender_icon.png 1 May, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెయ్యని తప్పుకు మంగమ్మను బలి పశువును చేస్తే ఊరుకోం

30-04-2025 08:50:31 PM

దళిత మహిళా ఉద్యోగినిపై భద్రాచలం టెంపుల్ ఈవో కక్ష్య పూరిత వైఖరి మార్చుకోవాలి..

తక్షణమే మంగమ్మని ఉద్యోగంలోకి తీసుకోవాలి..

కొండా కౌశిక్ బీఎస్పీ చర్ల మండలం అధ్యక్షులు.. 

చర్ల (విజయక్రాంతి): భద్రాచల పట్టణంలో శ్రీరాములవారి గుడి దేవస్థానం పరిధిలో డైలీ వేజ్ వర్కర్ గా పనిచేస్తున్న మంగమ్మని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని బీఎస్పీ చర్ల మండల అధ్యక్షులు కొండా కౌశిక్ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత నాలుగు నెలల క్రితం చేయని తప్పుకి నింద వేస్తూ ఉద్యోగం నుంచి తొలగించారని అలా చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. 

దళిత మహిళా ఉద్యోగినిపై భద్రాచలం టెంపుల్ ఈవో వైఖరి మార్చుకోవాలనీ తక్షణమే మంగమ్మని ఉద్యోగంలోకి తీసుకోవాలనీ ఆయన డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చిన పార్టీ నాయకులతో సంఘ పెద్దలతో ఈవో దురుసుగా మాట్లాడటం సరైనది కాదన్నారు, సాటి మహిళా అయి ఉండి ఒంటరి మహిళలు ఈ సమాజంలో పడే కష్టాలను ఈవో గుర్తించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. తక్షణమే మంగమ్మ ఉద్యోగంలోకి తీసుకోవాలని లేని యెడల ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.