30-04-2025 08:56:30 PM
మంథని (విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) బుధవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నాడు. మంథని నియోజకవర్గంలోని మహదేవ్ పూర్ నుండి కాటారం వెళ్తుండగా మార్గమధ్యలో బొమ్మాపూర్ క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అటువైపు వెళ్తున్న మంత్రి గాయలైన వారిని గమనించి తన వాహనాన్ని ఆపి, విషయం తెలుసుకొని వెంటనే వారిని తన స్కార్పియో ప్రత్యేక వాహనంలో హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయించాలని స్థానిక పోలీసులకు సూచించారు. ఆస్పత్రి వైద్య సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని శ్రీధర్ బాబు వైద్యులను కోరారు. దీంతో గాయపడ్డ వారు మంత్రిని అభినందించారు.