19-11-2025 07:55:11 PM
ముకరంపుర (విజయక్రాంతి): భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) గర్ల్స్ నూతన జిల్లా కన్వీనర్ గా ఉప్పునూటి మానస ఎన్నికయింది. జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ లో 14 మందితో కూడిన జిల్లా కమిటీ ఎన్నుకన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా నూతన గర్ల్స్ కన్వీనర్ ఉప్పునూటి మానస మాట్లాడుతూ విద్యార్థి సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.