calender_icon.png 22 January, 2026 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్వారకలో భగవద్గీత పారాయణం

22-01-2026 12:27:50 AM

వికారాబాద్, జనవరి-21: భగవద్గీత ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గీతా వాహిని సంస్థ ఆధ్వర్యంలో ద్వారక, బెడ్ ద్వారక లో సంపూర్ణ భగవద్గీత గీతా పారాయణం నిర్వహించారు. గతంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం కురుక్షేత్రం, అయోధ్య, యాదగిరిగుట్ట, ముచ్చింతలో కూడా నిర్వహించారు. భగవద్గీత ప్రపంచంలోనే  జీవిత సత్యాన్ని బోధించే గ్రంథం, భగవంతుడు స్వయంగా చెప్పినటువంటి ఈ ఉపదేశం వల్ల అందరి ప్రజల యొక్క సంక్షేమం, వ్యక్తిత్వ నిర్మాణం ఆధారపడి ఉందని గీతా వాహిని అధ్యక్షురాలు టి. శ్రీదేవి తెలిపారు.

మన జీవితంలో వచ్చే అనేక సమస్యలకు పరిష్కారం చూపించే గ్రంథమని, ఈ గ్రంథాన్ని ఇటీవల మన దేశంలో పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలలో ఈరోజు భగవద్గీతను తమ భాషలలోకి అనువదించి చదువుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. భగవద్గీతను రాబోయే రోజులలో భావి తరాలకు అందించే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు.

ఇందులో భాగంగానే శ్రీకృష్ణునికి సంబంధించిన స్థలాలలో ఈ సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజులలో శ్రీకృష్ణ జన్మస్థానమైన మధుర, పూరి జగన్నాథ్ ఆలయాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గీతా వాహిని కమిటీ సభ్యులైనా ఉపాధ్యక్షురాలు ఎం.లావణ్య, కోశాధికారి వి.వరలక్ష్మి, విజయ, మాధురి, సునీత, స్వరూప,ఝాన్సీ రాణి, నీరజ, కరుణ, స్వాతి, లక్ష్మి, సంజీవరాణి, సరిత, సరళ, జాగృతి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.సదానంద రెడ్డి,  సిద్ధార్థ కాలేజ్ డైరెక్టర్ జయదేవ్, అమరేందర్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.