22-01-2026 12:28:47 AM
బెజ్జంకి, జనవరి 21 : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంనిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు కరివేద మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలోని 7 మంది విద్యా ర్థులకు ప్రధాన మంత్రి మోదీ కానుకగా సైకిళ్లు పంపిణీ చేసిన మైపాల్ రెడ్డి మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే అధిక సంఖ్యలో చదువుకుంటారని వారికి రవాణా సౌకర్యం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మంత్రి బండి సంజయ్ సైకిల్లు అందజే యాలని నిర్ణయించడం విద్యార్థుల అదృష్టమన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి సంజయ్కుమార్ కు రిటర్న్గిఫ్ట్ ఇవ్వాలన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థుల పరీక్ష ఫీజ్ చెల్లించినట్లు తెలిపారు.
10వ తరగతి తుది పరీక్షలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారికి మొదటి బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.5వేలు అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్‌సొల్లు అజయ్ వర్మ, కోలిపాక రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ బుర్ర మల్లేశం, గ్రామ సర్పంచ్ జానకి, పద్మ , భామండ్ల జ్యోతి, తూముల రమేశ్ , అజిత్ రెడ్డి, శ్రీకాంత్, వంశీ, వార్డు సభ్యులు రమేశ్, రమ, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.