calender_icon.png 8 September, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్డి సంఘం పటిష్టతకు ప్రతి సభ్యుడు కృషి చేయాలి

08-09-2025 12:00:00 AM

మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

ఘట్ కేసర్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ రెడ్డి సంఘం పటిష్టతకు ప్రతి సభ్యుడు కృషి చేయాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్ కేసర్ రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం ఆదివారం ఎన్ ఎఫ్ సి నగర్ లోని ఎస్‌ఎల్‌ఎన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు.

అధ్యక్షులుగా చందుపట్ల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కొమ్మిడి శివ ప్రదీప్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లుగా పలుగుల శ్రీకాంత్ రెడ్డి, సుడి శ్రీకాంత్ రెడ్డి సంయుక్త కార్యదర్శిగా కంభం లక్ష్మా రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా బీరెడ్డి రవీందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా అందుకు సంబంధించిన పత్రాలను ఎమ్మెల్యే మల్లారెడ్డి చేతులమీరుగా అందజేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘంలో మునిసిపల్ ప్రాంత వ్యాప్తంగా ఉన్న రెడ్లు సభ్యులుగా చేరి సంఘంను మరింత పటిష్టం చేయాలన్నారు. సమాజ సేవ కార్యక్రమాలలో కూడా ముందుండాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన విధంగా రెడ్డి సంఘం అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని పేర్కొన్నారు.

రెడ్డి సంఘం కోసం కొండాపూర్ లో రెండు ఎకరాల స్థలం కేటాయింపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పలువుల మాధవరెడ్డి, మాజీ రెడ్డి సంఘం అధ్యక్షులు కట్ట జనార్దన్ రెడ్డి, నాయకులు కొమ్మిడి రాఘవరెడ్డి, మారం లక్ష్మారెడ్డి, రేసు లక్ష్మారెడ్డి చందుపట్ల ధర్మారెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి బొక్క సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.