calender_icon.png 5 November, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోదరుని క్షేమం కోరే ‘భాయ్ దూజ్’

23-10-2025 12:00:00 AM

హిందువుల ప్రతి పండుగకు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక, భావోద్వేగాలతో ముడి పడి గొప్ప పరమార్థం దాగి ఉంటుంది. వాటిల్లో సోదరి, సోదర బంధానికి ప్రతీక రెండు పండుగలు. ఒకటి శ్రావణ పౌర్ణమి నాడు వచ్చే రాఖీ పౌర్ణమి అయితే.. రెండోది దీపావళి తరువాత రెండవ రోజు కార్తీక శుద్ధ విదియ నాడు వచ్చే ‘భాయ్ దూజ్’ పండుగ. నేడు ఈ పండుగను ఉత్తర భారత దేశంలో ఘనంగా జరుపుకుంటారు. దీనినే భగిని హస్త భోజన పండుగ అని కూడా పిలుస్తారు. 

భగిని అంటే సోదరి, ఆమె వడ్డించే భోజనం కనుక భగిని హస్త భోజనం అని అంటారు.  ‘భాయ్ దూజ్’ రోజున అన్నదమ్ములు తమ అక్కా చెల్లెళ్ల ఇండ్లకు వెళ్లి వారికి బహుమతులు ఇ చ్చి వారి చేతి వంట తిన్న అనంతరం తిలకం దిద్దించుకుంటారు. ముఖ్యంగా ‘భాయ్ దూజ్’ అనేది సోదరుని క్షేమానికి సంబంధించినది.

భాయ్ దూజ్ పండుగను ఎక్కువగా ఉత్తర భారత దేశంలో పాటిస్తారు. ఈ పండుగ సోదరి, సోదర బంధాన్ని మరింత బలపరిచే పండుగ. ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆచారాలు మరిచి, కుటుం బ బంధాలు మరిచి ప్రేమ వివాహాలు జరగడంతో కుటుంబ స భ్యులు క్షణికావేశాలకు పోయి పరువు హత్యలకు పాల్పడుతున్నా రు. ఇలాంటి పండుగలు ప్రజలు తమ కుటుంబాలతో కలిసి జరుపుకుంటే మార్పు వచ్చి సమాజంలో రాక్షస ప్రవృతి ్త తగ్గవచ్చు.

వేణుమాదవ్, హైదరాబాద్