23-10-2025 12:00:00 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల నూతన పర్యాటక విధానాన్ని ప్రకటించడం అభినందనీయం. తొలిసారిగా తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించి మన సత్తాను నిరూపించింది. ఇదే స్ఫూర్తిలతో పర్యాటకంలో కూడా ముందడుగు వేయాలి. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల పరిధిలో అనేక చారిత్రక కోటలు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పోచారం, కవ్వాల్ వైల్డ్ లైఫ్ సఫారీలు, ఇంకా ఎన్నో గొప్ప పర్యాటక ప్రాంతాలున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. గతంలో ఈ జిల్లాను సందర్శించిన రేవంత్ ఆదిలాబాద్‌ను కశ్మీర్‌తో పోల్చారు. స్థానిక బయో డైవర్సిటీ పార్కు, కుంతల జలపాతం ప్రసిద్ధమైనవి. ఈ జలపాత ప్రాంతంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో అనేక సాహస క్రీడల శిక్షణా శిబిరాలను విజయవంతంగా నిర్వహించాం. ఇక్కడి పర్యావరణం ట్రెక్కింగ్, క్యాంపింగ్‌లకు, స్థానిక వాటర్‌బాడీస్ ప్రాంతం ర్యాప్టింగ్‌కు అనూకూలమైనది.
సాహస పర్యాటకానికి ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి. స్థానిక క్రీడలను, స్పోర్ట్స్ టూరిజంను ప్రోత్సహించాలి. రామప్ప గుడి మొదలైన పర్యాటక ప్రాంతాల్లో సర్వే చేసి అక్కడి విషయాలను పూర్తిగా పొందుపరచాలి. స్థానిక యువతకు శిక్షణ, కావాల్సిన సామగ్రిని అందించి సాంకేతిక, మార్కెటింగ్‌కు మద్దతు ఇవ్వాలి. పర్యాటకరం గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, అన్ని శాఖలను భాగస్వాములను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
రంగారావు, ఆదిలాబాద్