calender_icon.png 5 November, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంకుశత్వంపై నిరసనలు

22-10-2025 12:00:00 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం ప్ స్వతహాగా తీసుకుంటున్న నిర్ణయాలు స్వదేశంలోనే అమెరికా వాసులకు అగ్రహజ్వాలలు రగిలేలా చేస్తున్నాయి. కొన్ని నెలలుగా స్వల్పంగా మొదలైన నిరసనల పర్వ శనివారానికి ఉగ్ర రూపాంత రం చెందింది. అమెరికాలోని దాదాపు 2500 ప్రాంతాల్లో ‘నో కింగ్స్’ పేరుతో ని రసనలు దేశవ్యాప్తంగా మిన్నంటాయి. లక్షలాది మంది ప్రజలు, సంస్థలు, డెమోక్రా ట్స్ రోడ్లు ఎక్కి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు, నినా దాలతో వీధులను హోరెత్తించారు. అ మెరికాలో ప్రధానమైన న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, ఫిలిడెల్ఫియా, అ ట్లాంటా, హ్యూస్టన్, చికాగో నగరాలతో పాటు యాభై రాష్ట్రాల్లో ‘అమెరికాలో రా జులు లేరు, చక్రవర్తులు లేరు’ అంటూ ని నదించారు. అమెరికా రాజ్యాంగం ప్రకా రం పాలన అందించాలని.. నిరంకుశ పాలనను సహించేది లేదంటూ నిరసనకారులు ఉద్యమించారు.

ఒక్క అమెరికాలో మాత్ర మే కాదు యూరప్ దేశాల్లో కూడా అమెరికా రాయబార కార్యాలయాల ముందు అక్కడి అమెరికన్లు నిరసనలు వ్యక్తం చేయ డం గమనార్హం. రెండోసారి అమెరికా అ ధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ కు వ్యతిరేకంగా స్వదేశంలోనే ఇంత ఉధృత తిరుగుబాటు జరగడానికి కారణాలు చా లానే ఉన్నాయి. వాటిలో ప్రధాన కారణం మాత్రం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పేరుతో రకరకాల ఉత్తర్వులు జారీ చేసి పాలనను అస్తవ్యస్తం చేయడమే. గత మూడు వారాలుగా అమెరికాలో ‘షట్ డౌన్’ ప్రారంభ మై అనేక మంది ఉద్యోగాలు కోల్పోవడం, ద్రవ్యోల్బణం పెరుగుదల, వలసలపై తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రఖ్యాత యూనివ ర్సిటీలకు నిధులు నిలుపుదల చేయడం, విద్యాశాఖపై తీసుకున్న నిర్ణయాలు, అనేక రంగాల్లో, శాఖల్లో ఉద్యోగాల కోత వంటి అనేక నిర్ణయాలు ప్రజలను ఆగ్రహావేశాల కు గురిచేస్తున్నాయి.ఈ నిరసనలు జనరేషన్ జెడ్ (జెన్ జెడ్) తరహాలో ఉధృతం అవుతుండటం పట్ల ప్రపంచం మొత్తం అమెరికా పరిణామాలను ఆసక్తిగా పరిశీలిస్తున్నది.

కఠిన వైఖరితో

‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే నినాదంతో గద్దెనెక్కిన ట్రంప్.. మొదట్లో చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాలపై అధిక సుంకాలు విధించి, తదుపరి పునః సమీక్ష చేసుకున్నారు. ఇక పాలనా సంస్కరణల నె పంతో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ ను ఏర్పాటు చేసిన ట్రంప్.. వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. జన్మతః పౌరసత్వం, ట్రాన్స్‌జెండర్ల రక్షణ, అక్రమ వల సలు తదితర అంశాల్లో కీలక మార్పులు చేశారు. ఈ క్రమంలో వలసదారులపై అ ధికారుల సోదాలు వివాదాస్పదంగా మా రింది.

మొత్తంగా ట్రంప్ విధానాలు నిరంకుశంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఇక అమెరికాలో భారత్‌కు చెందిన వారు ఎ క్కువగా ఉంటారు. అయితే మన దేశంపై కూడా దాదాపు యాభై శాతం సుంకాలు విధిస్తూ, విరోధం తెచ్చుకోవడం గమనిస్తూనే వచ్చాం. మన భారతీయ విద్యార్థుల పై ఆంక్షలు విధించడం, వీసాల జారీ కఠినతరం చేయడం వల్ల భారత్‌తో ఉన్న స్నేహహస్తం దూరమయ్యేలా చేసుకున్నా రు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ని రాశావాదం వ్యక్తం చేశాయి.

తాజాగా అ మెరికాలోనే ఆయన సొంత ప్రజలే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అసహనం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. మరో అడుగు ముందుకేసి ప్రపంచంలో జరిగిన అన్ని యుద్ధాలు తానే ఆపానని.. ముఖ్యం గా అణ్వాయుధ దేశాలైన భారత్, పాక్ మధ్య యుద్ధం తానే అపానని ట్రంప్ పేర్కొన్నారు. దీనిని భారత్ తీవ్రంగా ఖం డించింది. ఇది చాలదన్నట్లు ఇవాళ భా రత్.. రష్యా నుంచి చమురు కొనడం ఆపేసిందంటూ బాహటంగా పేర్కొనడం అం దర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఒక పక్క తాను తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధం అని ఫెడరల్ కోర్టు పేర్కొనడం, మరోపక్క నోబెల్ బహుమతి కోసం ఆరా టం పడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తన మా టలతో, చర్యలతో ట్రంప్ అంతర్జాతీయం గా వివిధ దేశాలతో సత్సంబంధాలు కో ల్పోవడం జరుగుతుంది. 

సొంత పార్టీలో వ్యతిరేకత

స్వదేశంలో ట్రంప్‌పై నిరసనలు వెల్లువెత్తడంతో తన పార్టీకి చెందిన కొంతమంది రిపబ్లికన్ సభ్యులు ఆయన నుంచి దూరమవుతున్నారు. ట్రంప్‌కు సొంత పార్టీ సభ్యులే దూరమవ్వడం ఇదేమీ కొత్త కా దు. 2021లో జరిగిన రెండో అభిశంసన తీర్మానంలో ట్రంప్‌ను 57 సెనేటర్లు ‘దోషి’గా, 43 మంది ‘దోషి కాదు’ అంటూ ఓటు వేశారు. ఇందులో ఏడుగురు రిపబ్లికన్ సెనేటర్లు కూడా ట్రంప్ పై ‘దోషి’గా ఓటు వేసి సొంత పార్టీలోనే అసంతృప్తి ఉందని సూచించారు. ఇటీవల జూన్ 2025లో హౌస్ ఆఫ్ రిప్రెసెంటేటివ్‌లో మరో అభిశంసన తీర్మానాన్ని ఓటమితో పోల్చడం, ట్రంప్ పట్ల రాజకీయ మద్దతు ఇంకా ఉందని తెలియజేస్తుంది.ట్రంప్ తనపై నడుస్తున్న న్యాయపరమైన విచారణలను నిరంతరం అడ్డుకోడానికి ప్రయ త్నిస్తూనే వచ్చారు.

ఎన్నికలను తిప్పికొట్టే ప్రయత్నాల కేసులో, ప్రత్యేక సలహాదారు జాక్ స్మిత్ తన విచారణలో ‘నేర నిర్ధారణ కు సరిపడిన ఆధారాలు’ ఉన్నట్లు నివేదించారు. 2024లో ట్రంప్ మళ్లీ అధ్య క్షుడిగా ఎన్నికవ్వడంతో ఒక పదవిలో ఉన్న అధ్యక్షుడిని ప్రాసిక్యూట్ చేయలేమన్న నియ మం వల్ల కేసు రద్దు చేయాల్సి వచ్చి ంది. ఇది అతను న్యాయ వ్యవస్థ నుం చి తప్పించుకున్నారనే భావనకు దోహదం చేసింది. 2020 ఎన్నికలను తిప్పికొట్టే ప్రయత్నా లు కోసం ట్రంప్‌పై ఫెడరల్ నేర కేసు న మోదైంది. ఈ కేసులో అతని అధికారిక చ ర్యలకు నిర్భంధ హక్కు (ఇమ్యూనిటీ) ఉందా అనే ప్రశ్న సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టు పూర్వ అధ్యక్షుడికి ‘అధికారిక చర్యలకు’ కనీసం ‘ప్రిసంప్టివ్ నిర్భంధ హక్కు’ ఉంటుందని తీర్పునిచ్చింది. ఈ తీ ర్పు వల్ల ట్రంప్ అనేక వివాదాస్పద చర్య లు తీసుకోవడం మొదలుపెట్టారు. 

తీవ్ర అసంతృప్తి

ఇలా రెండోదఫా అధ్యక్షుడైన స్వల్ప కాలంలోనే ట్రంప్ ప్రజల్లో అసంతృప్తి మూటగట్టుకోవడంతో, భవిష్యత్తులో అ మెరికా పరిస్థితి ఏమిటనే భావన అందరిలోనూ కలుగుతున్నది. ముఖ్యంగా ఒక పక్క భారత్ మాకు మిత్రుడు అంటూనే, మరోపక్క ఇటీవల కాలంలో పాకిస్థాన్‌తో సన్నిహితంగా మెలుగుతూ తనకు తోచిన విధంగా వ్యాఖ్యలు చేస్తూ మనకు క్రమం గా దూరమవుతున్నారనిపిస్తుంది. ఈ వి ధంగా స్వదేశంలోనూ, అంతర్జాతీయ స్థా యిలోనూ ట్రంప్ తన నిర్ణయాలు వల్ల తీ వ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. త న ఎన్నికల ప్రచారంలో కుడి భుజంగా ప నిచేసిన మస్క్‌ను సైతం తన నిర్ణయాల తో దూరం చేసుకున్నారు. ప్రపంచానికి తా ను ఒక సుప్రీం కమాండర్ అన్న తరహాలో ఎవరి మాట వినకుండా తనకు నచ్చిందే చేసుకుంటూ వెళ్తూ తన ప్రతిష్టను దిగజార్చుకుంటున్నారు. 

ఈ విధంగా అతి తక్కు వ సమయం లో ట్రంప్ తనపై ప్రపంచం మొత్తం అసహనం వ్యక్తం చేసే పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. అంతర్జాతీయ సంస్థలు ఐక్యరాజ్యసమితి సమితి నిర్ణయాలు బే ఖాతరు చేయడం, డబ్ల్యూహెచ్‌వోకు ని ధులు నిలిపేయడం, పర్యావరణ పరిరక్షణ చట్టాల నుంచి, ఒప్పందాలు నుంచి బ యటకు రావడం కూడా ట్రంప్ ఇమేజ్‌ను దె బ్బతీస్తున్నాయని చెప్పొచ్చు. ఇకనై నా ట్రంప్ తన నిర్ణయాలు పునః స మీక్షచేసుకోవడం, ఆచితూచి అడుగులు వేయ డం చేస్తేనే అమెరికా ప్రజల్లో తన ప్రతిష్టను కా పాడుకున్నవారు అవుతారేమో చూడాలి.  అలా కాని పక్షంలో అతి త్వరలోనే స్వదేశం లో, అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ పలుచనయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అం తేకాదు భవిష్యత్తులో తన పొంతన లేని నిర్ణయాలతో స్వదేశంలో తన సొంత ప్రజ ల ఆగ్రహావేశాలకు లోనవ్వడంతో పాటు ప్రపంచ రాజకీయ ఆర్థిక అనిశ్చితికి ట్రంప్ కారణమయ్యే ఉండే అవకాశం కూడా లేకపోలేదు.

 వ్యాసకర్త సెల్: 6305682733