11-09-2025 12:56:59 AM
శిబూసోరెన్ మృతికి సంతాపం
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మార్యాదపూర్వకంగా కలిశారు. జార్ఖండ్ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం రాంచీలోని సీఎం హేమంత్‌సోరెన్ నివాసానికి వెళ్లారు.
ఆయన తండ్రి, మాజీ సీఎం శిబూసోరెన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన మృతికి భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు. కాగా ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడ విస్తృతంగా పర్యటించడంతో పాటు జేఎంఎం, కాంగ్రెస్ కూటమి విజయం కోసం పని కీలక పాత్ర పోషించారు.