11-09-2025 12:57:15 AM
ఇటిక్యాల, సెప్టెంబర్ 10:తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగించాలని సిపిఎం జోగులాంబ గద్వాల జిల్లా కార్యదర్శి వెంకటస్వామి పిలుపునిచ్చారు. బుధవారం ఆమె వర్ధంతిని పురస్కరించుకుని ఎర్రవల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... భూమికోసం,భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం ఆమె చేసిన పోరాటాలను కొనియాడారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశ చరిత్రలో మైలు రాయిగా నిలిచిందని అన్నారు.3వేల గ్రామాలు భూస్వాముల నుండి విముక్తి కల్పించ బడ్డాయని 10లక్షల ఎకరాల భూమి భూస్వాముల నుండి విముక్తి కల్పించి పేదలకు పంపిణీ చేశారని అన్నారు.
పోరాటంలో ఐలమ్మ పాత్ర మరువలేనిదని ఎర్రజెండా అండతో చైతన్యమై వేలాది మందిని పోరాటంలోకి నడిపిందనీ అన్నారు.ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ నాయకులు యాదన్న,భీచుపల్లి,రాజు,నగేశ్, రవి,హుస్సేన్,సుంకన్న,గోవిందు తదితరులు పాల్గొన్నారు.