calender_icon.png 21 August, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులు పట్టుదలతో ఆటల్లో రాణించాలి

21-08-2025 12:33:16 AM

  1. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

ఎల్బీనగర్ లో రాజీవ్ గాంధీ ఖేల్ ఉత్సవ 3కే రన్

ఎల్బీనగర్, ఆగస్టు 20 : క్రీడాకారులు కసి, పట్టుదలతో క్రీడల్లో రాణించి, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటాలని రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడలను ప్రోత్సాహించాలనే ల క్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025 స్పోరట్స్ పాలసీని తెచ్చారని ఆయన తెలిపా రు. మాజీ ప్రధాని రాహుల్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ ఖేల్ ఉత్సవ 3కే రన్ నిర్వహించారు.

కొత్తపేటలోని ఓమ్ని హా స్పిటల్ నుంచి సరూర్ నగర్ ఇండోర్ స్టేడి యం వరకు 3కే రన్ నిర్వహించారు. ర్యాలీలో కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గం  ఇన్ చార్జి మధుయాష్కీగౌడ్, తెలంగాణ రా ష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్, రంగారెడ్డి జిల్లా అబ్జర్వర్ శివసేనా రెడ్డి, ఎమ్మెల్సీ ద యానంద్ గుప్తా, టీపీసీసీ సభ్యుడు దేప భా స్కర్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్రీడాకారులు ఉద్దేశించి మాట్లాడారు.తెలంగాణ యువత డ్రగ్స్, మద్యపానా నికి అలవాటు కాకూడదని, స్కూలు అయిపోయిన వెంటనే గ్రౌండ్ కు పరుగులు తీసి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ముందుకు సాగాలని కోరారు. 2035లో ఒలంపిక్ పోటీల్లో పాల్గొనేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని తెలి పారు. క్రమశిక్షణతోనే క్రీడా పోటీల్లో రాణిస్తారని పేర్కొన్నారు. గ్రౌండ్ లో దిగిన తర్వా త గెలుపే లక్ష్యంగా ఆడాలని సూచించారు.

తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రోత్సాహస్తున్నారని, గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. యువత మత్తు వదిలి మైదానం బాట పట్టమని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారని తెలిపారు. ఒలంపిక్స్ పోటీల్లో గోల్ మెడల్ సాధిస్తే శంషాబాద్ నుంచి భారీ ర్యాలీ తీసి గౌరవిస్తామని, స్టేడియంలో కోచ్ ల కొరత లేకుండా చేస్తామని హామీ ఇచ్చా రు. సరూర్ నగర్ స్టేడియంలో జిమ్ ఇతర వసతులు కల్పించడానికి రూ. 200 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని బయటికి తీసి దేశా నికి వన్నె తెచ్చే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.  క్రీడాకారులకు అవకా శాలు మాటిమాటికి రావని, అవకాశాలు వచ్చినపుడే తన శక్తి చూపించాలని  సూచించారు.  కార్యక్రమంలో జిల్లా క్రీడాలఅధికారి వెంకటేశ్వర్ రావు, ట్రెజరర్ రాజశేఖర్ రెడ్డి, కోచ్ లు విజయ్ కుమార్, సాయిబాబా, రమాదేవి,

యాదయ్య, జనయ్ సింగ్, కిశోర్, సైదులు, శ్రీకాంత్, కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలు క ఉపేందర్ రెడ్డి,  పున్న గణేష్ నేత, బండి మధుసూదన్ రావు, శంకర్ యాదవ్, గణేష్ రెడ్డి, ధనరాజ్ గౌడ్,  మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, దేవాలయ కమిటీల డైరెక్టర్లు, మహిళా, సేవాదళ్, తదితరులుపాల్గొన్నారు.