calender_icon.png 21 August, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య పిల్లల బాగోగులు చూడని ఉద్యోగి సస్పెన్షన్

21-08-2025 12:00:30 AM

పెద్దపల్లి,(విజయక్రాంతి): తరచుగా గృహ  హింసకు పాల్పడుతూ భార్యా పిల్లల బాగోగులు పట్ల శ్రద్ధ వహించని ప్రభుత్వ ఉద్యోగి ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఫార్మసిస్టుగా పని చేస్తున్న కె.రవీందర్ భార్యా పిల్లలను పట్టించుకోకుండా వారి పోషణను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆయన భార్య కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిందన్నారు. 

స్థానిక సఖి కేంద్రం సిబ్బంది భార్యాభర్తల ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించడానికి ప్రయత్నించగా, కె.రవీందర్ సహకరించలేదని, గృహహింస నిరోధక చట్టం ప్రకారం జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ నోటీసులు జారీ చేసినప్పటికీ రవీందర్ కౌన్సిలింగ్ కు హాజరు కాలేదని  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు నివేదిక అందించారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పరివర్తన నియమావళి ప్రకారం భార్య పిల్లల పోషణను నిర్లక్ష్యం చేస్తున్న ఫార్మాసిస్టు కె.రవీందర్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.