calender_icon.png 21 August, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హయత్‌నగర్ చరిత్ర, గొప్పతనం

21-08-2025 12:31:36 AM

  1. ప్రతిబింబించేలా బొడ్రాయి ఉత్సవాలు

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ 

బొడ్రాయి ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ 

రూ.2లక్షల విరాళం ప్రకటించిన మధుయాష్కీగౌడ్

ఎల్బీనగర్, ఆగస్టు 20 : హయత్ నగర్ గ్రామ చరిత్ర, గొప్పతనం ప్రతిబింబించేలా బొడ్రాయి ఉత్సవాలను నిర్వహించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పి లుపునిచ్చారు. అక్టోబర్ 9 నుంచి 12 వరకు  హయత్ నగర్ గ్రామ బొడ్రాయి (నాభిశిల) ప్రతిష్టాపన మహోత్స వాలను నేతాజీ కాలనీలో నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉ త్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను  బుధవారం హయత్ నగర్ లోని  అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ... గ్రామస్తులందరూ కులాలకు, రాజకీయాలకతీతంగా ఐక్యమత్యంతో ఉత్సవాలను నిర్వహించాలన్నారు.

మధుయాష్కీ గౌ డ్ మాట్లాడుతూ... తాను పుట్టి పెరిగిన గ్రా మమైన హయత్ నగర్ లో బొడ్రాయి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని, తన వంతుగా రూ. 2 లక్షలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి ఉత్సవాలకు రూ, 50 వేల విరాళం ప్రకటించారు. బేధాభిప్రాయాలను పక్కనపెట్టి ఐకమత్యం తో ఉత్సవాల నిర్వహించాలని కోరారు.

కార్యక్రమంలో హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, బీఆర్‌ఎస్ నాయ కులు నక్క రవీందర్ గౌడ్, దర్శన్ గౌడ్, చెన్నగొని శ్రీధర్ గౌడ్, మల్లీశ్వరి రెడ్డి, భాస్కర్ సా గర్, మల్లేష్ ముదిరాజ్, కళ్లెం రవీందర్ గౌడ్  పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, మా జీ కార్పొరేటర్ వజీర్ ప్రకాశ్ గౌడ్, మాజీ కౌ న్సిలర్ కళ్లెం రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి,  చెన్నగోని ర వీందర్ గౌడ్, ఎల్బీనగర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ బోడ భిక్షపతి, యూత్ కాం గ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం చరణ్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.