21-08-2025 12:33:31 AM
- ప్రభుత్వ భూమి పరిరక్షణలో తీవ్రజాప్యం
- 2013 నుంచి నానుతున్న భూవివాదం
-దర్జాగా సేద్యం చేస్తున్న ఆక్రమణ దారి
భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 20 (విజయ క్రాంతి):ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు రెవెన్యూ వ్యవస్థ ను ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయి అధికారులు ఆదేశించిన క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యం చేయడంతో గత 12 ఏళ్లుగా ప్రభుత్వ భూమి వివాదం నేటికీ కొలిక్కి రాకపోవడం రెవెన్యూ పరిపాలన ద క్షతను ధృవపరుస్తోంది.
భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని వెంగళరావు కాలనీకి చెందిన సర్వేనెంబర్ 727 లో 2013లో భూ వివాదం తలెత్తింది. 727 సర్వే నంబర్లు 5.20 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఓ ప్రబుద్ధుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించి అమ్మకానికి తెరలేపడంతో విష యం వెలుగు చూసింది. దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు అప్పటి రెవెన్యూ అధికారి మస్తాన్ రావు 2013లో 7 నెంబర్ నోటీసు జారీ చేయడం జరిగింది.
2014లో అప్పటి తాసిల్దార్ సమ్మిరెడ్డి సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించి ఆక్రమణ దారుడికి మెమో జారీ చేయడం జరిగింది. 2017 లో అప్పటి ఎమ్మార్వో ధన్య నాయక్ ఆక్రమణదారుడికి 6 నెంబర్ నోటీస్ జారీ చేసి ప్రభుత్వ భూమిని ఖాళీ చేయాలంటూ ఆదేశించారు. రెవెన్యూ శాఖలోని కొందరు అధికారుల తప్పుదోవ పట్టించి తప్పుడు పట్టేదారు పాసుపుస్తకాలు పొందినట్లు గుర్తిం చిన అధికారులు వాటిని రద్దు చేయకుండా ఆక్రమణదారులకు కొమ్ము కాస్తూ వచ్చారు.
ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సదరు ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం భూ వివాదం కోర్టుకు చే రింది. పట్టేదారుగా చూపుతున్న అతను 3. 10 ఎకరాల కు పట్టా ఉందని కోర్టును ఆశ్రయించడంతో ఆ స్థలం వరకే కోర్టులో వివా దం ఉంది. మిగిలిన 2.10 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోకుం డా, ఆక్రమణ దారుని ఆమ్యామ్యాలకు అ మ్ముడుపోయి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి.
ఒకవైపు ప్రభుత్వం ప్ర భుత్వ భూములు పరీక్షించాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్న, క్షేత్రస్థాయిలో తహసి ల్దార్, గిరధావర్లు ఆక్రమణదారులకు అ మ్ముడుపోయి ప్రభుత్వ భూముల పరిరక్షణను గాలికి వదులుతున్నారని ఆరోపణలు పిలబడుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కల్పించుకొని కోర్టు వివాదంలో ఉన్న 3.10 ఎకరాల భూమిని మినహాయించి మిగిలిన 2.10 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని వెంగళరావు కాలనీ ప్రశాంత్ కాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.