21-08-2025 12:00:00 AM
సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్‌నగర్ ఆగస్టు 20 (విజయక్రాంతి):- ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు సకాలంలో స్పందించి పరిష్కరించా లని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. రాంగోపాల్ పేట డివిజన్‌లోని విక్టోరియా గంజ్‌లో పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు పలువురు మంగళవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి విన్నవించారు.
స్పందించిన ఆయన బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి విక్టోరియా గంజ్‌లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా తమ బస్తీలో తరచుగా డ్రైనేజీ పొంగిపోతున్నదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వివరించారు. అంతేకాకుండా నల్లా బిల్లులు చెల్లిస్తేనే డ్రైనేజీ లైన్ శుభ్రం చేస్తామని అధికారులు సమాధానం చెబుతున్నా రని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పిర్యాదు చేసారు.
స్పందించిన ఆయన మాట్లాడుతూ ఇక్కడ అంత నిరుపేదలే నివసిస్తున్నారని, వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని అధికారులను ఆదేశించారు. తమ ప్రభుత్వం ఉచితంగా త్రాగునీటి సరఫరా కార్యక్రమం ప్రారంభించిందని, నల్లా బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేయొద్దని స్పష్టం చేశారు. నల్లా బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
వెంటనే విక్టోరియా గంజ్ లో డ్రైనేజీ లైన్ ను పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని, ఎమ్మెల్యే వెంట ఆశిష్, హార్టికల్చర్ అధికారి రాజిరెడ్డి, స్ట్రీట్ లైట్ అధికారి సాగర్, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, కోటేశ్వర్ గౌడ్, బస్తీ వాసులు మల్లేష్, అర్జున్, లావణ్య, శివ కుమార్, కిరణ్, రాంచందర్ తదితరులు ఉన్నారు.